నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లోని కేంబ్రిడ్జి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన పలు ఎగ్జిబిట్లను పరిశీలించి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ ఫలితాలను నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించే ఒక పోటీతత్వాన్ని ప్రదర్శిస్తుందని, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు గ్రేడ్ పాఠశాలల, ఉన్నత పాఠశాలల లోని విద్యార్థులు విజ్ఞానం, లేదా సాంకేతిక కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తాయని తెలిపారు. ఈ ప్రదర్శన విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక గా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వెంకటేష్ నాయక్, డాక్టర్ వాణిశ్రీ, నాయకులు మనెపల్లి సాంబశివరావు, సంగారెడ్డి, ప్రభాకర్, రాజేందర్ పాల్గొన్నారు.