నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, కొమ్మదాసరులు, సొదమ్మ, పిట్టల దొర మొదలగు జానపద కళారూపాలు శిల్పారామం మాదాపూర్ లో సందడి చేశాయి. హైటెక్ సిటీ శిల్పారామం లో సందర్శకులు వాటిని చూసి సంబ్రమశ్చర్యంలో మునిగితేలారు.
గంగిరెద్దుల ఆటలు ఎంతగానో ఆకట్టుకున్నవి. సాయంత్రం యంపీ థియేటర్ బెంగళూరు నుండి విచ్చేసిన విదుషి అపర్ణ శంకర్ బృందం “సంభవామి యుగే యుగే ” భరతనాట్య నృత్య రూపకం ఎంతగానో అలరించింది. సుస్మిత మిశ్ర శిష్య బృందం ఒడిసి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.
బోగి పండుగ పురస్కరించుకొని చిన్న పిల్లలందరికీ “భోగి పళ్ళ ” ఉత్సవం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు వారి పిల్లలను తీసుకొని శిల్పారామం కి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా భోగిపళ్లు ఉత్సవం లో పాల్గొనవచ్చని తెలిపారు.