నమస్తే శేరిలింగంపల్లి: పండగ వేడుకల్లో పర్యావరణం, ప్రకృతికి హాని కలిగించేలా వ్యవహరించవద్దని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనీస్ మంజా కలిగిన గాలిపటాలు ఎగుర వేయొద్దని సూచించారు.
వాటివల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని, పక్షులు ఆ మాంజాలో చిక్కుకుని చనిపోయిన సంఘటనలు అత్యధికంగా ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మసులుకోవాలని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.