- పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ విశేష పుష్పాలంకారం , నిత్య అర్చనలు తదనంతరం ఉదయం 5. 30 న హరతి తీర్థ ప్రసాదాల తదనంతరం 6 నుంచి అర్చనలు 10.30 నుండి శ్రీపద్మావతిమాత శ్రీ గోదాదేవిమాత సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కళ్యాణంలో పాల్గొన్న దాతలను సత్కరిచి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిపించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు దేవాలయ సేవాసమితి, అశేష భక్తులు పాల్గొని హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.