నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం ఎంతగానో అలరిస్తున్నది. సందర్శకులకు చేనేత హస్తకళా ఉత్పత్తులు ఉదయం 10 .30 నుండి రాత్రి 8 .00 గంటల వరకు అందుబాటులో ఉంటుండడంతో పెద్ద ఎత్తున వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ఉత్పత్తులు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నవి.
అంతేకాక మేళా భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. మృణాళిని శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ సౌజన్యం తో ప్రదర్శిస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ దాస్ బృందం బిహు డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా అలరించింది.