నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సారీ మేళా, బతుకమ్మ, దసరా ఉత్సవాలు సందడిగా సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
డాక్టర్ రమాదేవి శిష్య బృందం కూచిపూడి నృత్యంలో గేమ్ గణపతిమ్, దేవా దేవం భజే, మా మవుతూ శ్రీ సరస్వతి, భజరే గోపాలం, తరంగం అంశాలను ప్రదర్శించారు. సంధ్య రాజు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. ఝేమ్ ఝేమ్, రామాయణ శబ్దం, తిల్లాన మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.