నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ సినీ నటుడు తారకరత్న అకాల మరణం తీవ్ర ధ్రిగ్బంతికరమని పరభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మోకీల లోని తారకరత్న స్వగృహానికి వెళ్లి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి నందమూరి తారకరత్న పార్థివ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నందమూరి తారక రత్న మంచి మనసున్న వ్యక్తి అని, సినీ విలకాశంలో వెలుగు వెలిగిన గొప్ప నటుడని అన్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించాడని తెలిపారు. అని,ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారని, 2009లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారని తెలిపారు. తారక్ అకాల మరణం సినీ రంగానికి తీరని లోటన్నారు.