నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లోని యంపీ థియేటర్ లో వాగ్దేవి సంగీత శిక్షణాలయం సంగీత గురు గాయత్రీ దేవి శిశ్య బృందం సంగీత విభావరి నిర్వహించింది.
శ్వేతా, శరణ్య, భార్గవి, అపర్ణ, మొదలైన వారు సీతమ్మ మాయమ్మ, ప్రణమామ్యహం, జగదానందకారకా, బ్రోవభారమ, అన్నపూర్ణే, సుమనస, ఆదిలక్ష్మి, శ్రీమన్నారాయణ, ఇదిగో భద్రాద్రి, పహిరమా ప్రభో మొదలైన సంకీర్తనలను అలరించారు. వీరికి పవన్ సింగ్ వయోలిన్, శ్రీకాంత్ మృదంగం, ఘటం వెంకటేష్ సహకరించారు.