- పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంబీసీ డెవలప్మెంట్ చైర్మన్ జేరిపాటి జైపాల్, శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి అని, శేరిలింగంపల్లి నియోజకవర్గ స్థాయిలో అత్యధిక మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని ఎంబీసీ డెవలప్మెంట్ చైర్మన్ జేరిపాటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నిప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ యాదవ్, సునీత ప్రభాకర్ రెడ్డి, జేరిపాటి రామచందర్ రాజు, డివిజన్ అధ్యక్షులు అలీ, నల్ల సంజీవ రెడ్డి, ఇలియాస్ షరీఫ్, వీరందేర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్యారాజన్, యువ నాయకులు కట్ల శేఖర్ రెడ్డి, మైనారిటీ చైర్మన్ అజీమ్, ఓబీసీ హరి, గౌస్, మహిళలు, యువకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.