నమస్తే శేరిలింగంపల్లి : బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ ఉల్లంఘన తప్పదని, కాంగ్రెస్ పాలన కూడా ప్రమాదకరమని యంసిపిఐ(యు) అభ్యర్ధి కామ్రేడ్ వనం సుధాకర్ అన్నారు.
రాజేంద్రనగర్ లోని పార్లమెంట్ ఆర్వో కార్యాలయానికి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడారు. ప్రజాతంత్ర శక్తులు దేశ పార్లమెంట్లో అధికారంలో ఉండాలని, అప్పుడే భారత వ్యవస్థ సుస్థిరంగా ఉంటుందన్నారు.