- పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాల అందజేత
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో రేపు బాలల దినోత్సవం సందర్బంగా వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కలర్ హుడ్ విసువల్ ఆర్ట్ అకాడమీ అనిత నేతృత్వంలో ‘ఆర్ట్ క్రియేషన్ అండ్ ఎక్స్ ప్లోర్ యువర్ టాలెంట్’ అంశం పై పెయింటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల్గొన్న పిల్లలందరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఎత్నిక్ హాల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్, మువ్వా నృత్య రాగ నిగమం ఆధ్వర్యం లో డాన్స్ అండ్ డ్రామా వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ టి. రంగయ్య విచ్చేసి పిల్లలను ప్రోత్సహించారు. పిల్లలకు “అమర్ చిత్ర కథ” పుస్తకాలను అందజేశారు. సాయంత్రం యంపీ థియేటర్ లో భావన పెదప్రోలు శారద కళాక్షేత్ర శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన (వినాయక కౌతం, గణేశా పంచరత్న, పుష్పాంజలి, బ్రహ్మాంజలి, గణపతి తాళం, ముద్దుగారేయ్ యశోద, రామాయణ శబ్దం, తీరు తీరు జవరాల, తరంగం, వాడెలెను వయ్యారాలు, తాండవం, కళింగ నర్తన తిల్లాన, హంసానందిని తిల్లాన)లో మెప్పించారు.