- కాపు సమారాధన మహోత్సవంలో ముఖ్య అతిథులు
నమస్తే శేరిలింగంపల్లి: ఎస్ఎన్ రెడ్డి గార్డెన్ లో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. కాపులందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. అప్పుడే ఆర్థికంగా రాణిస్తూ సాధిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో మిరియాల రాఘవరావు, ఎన్ హెచ్ రావు, బొలిశెట్టి శ్రీనివాస్ రావు, సినీ ప్రముఖులు జి. సుధాకర్ నాయుడు, కొండేటి సురేష్, మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇన్ ఛార్జి గాలి అనిల్, పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ్ ఉన్నారు. అంతేకాక ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్, కూకట్ పల్లి నుండి వెంకటేశ్వరరావు, గంధం రాజు, భరత్ నాయుడు , కాళ్ల పాలెం బుజ్జి , శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం నాయకులు మిరియాల ప్రీతం, ఆదిమూలం త్రినాధుడు, కృష్ణ వెంకటేశ్వరరావు, విష్ణుమూర్తి, పూల కిషోర్, ఏడుకొండలు గణపతి, ఓడిఎఫ్, బీడీఎల్ ఇస్నాపూర్, పటాన్ చెరు, రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, బొల్లారం, కొండాపూర్, మియాపూర్, నిజాంపేట, కుత్బుల్లాపూర్ కాపు సంఘాల నుంచి సుమారు పదివేల మంది పాల్గొని కాపు సమారాధన మహోత్సవాన్ని విజయవంతం చేశారు.