- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: 67 వ రోజు గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో రెండవ రోజు కొనసాగింది. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అవినీతిని, ప్రజల గోస పట్టని ఎమ్మెల్యే అసమర్థతను ప్రజలకు వివరిస్తూ, నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ, ఇంటి ఇంటికీ కరపత్రాలను పంచుతూ బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికీ ఇవ్వకుండా వాళ్ళ అనునుయులకే కట్టబెడతారని, ప్రభుత్వం తో కొట్లాడి ఒక్క పని చేయించలేదని, ఇలాంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపిచాలని పిలునిచ్చారు.
ప్రజల కోసం పోరాడే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.