- శేరిలింగంపల్లిలో ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించి అధికారులను సూచనలు చేసిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని కేంద్రాలలో దరఖాస్తు ఫారంలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందవద్దని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేస్-2 కాలనీ, హైదరనగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.టి హిల్స్ కమ్యూనిటీ హాల్ వద్ద సంక్షేమ పథకాల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎవరు సెంటర్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఏవైనా ఇబ్బందులుంటే అధికారులను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
అనంతరం సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకొని, ప్రజలకు అన్ని విధాలా అర్ధం అయ్యేలా వివరించాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.