నమస్తే శేరిలింగంపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభయహస్తం దరఖాస్తులను సమీప ప్రజా పాలన కేంద్రాలలోనే సమర్పించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని కమ్యూనిటీ హాలు (బస్తీ దవాఖాన) ఆవరణలో, అంజయ్య నగర్ వార్డు కార్యాలయంలో, కొత్తగూడ కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తు స్వీకారణ కేంద్రాలకి వెళ్లి దరఖాస్తు స్వీకరణ పక్రియను దగ్గర ఉండి పర్యవేక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటం ప్రజా ప్రతినిధుల, అధికారుల, నాయకుల బాధ్యతని తెలిపారు. జనవరి 6వ తారీకు వరకు ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. దరఖాస్తు పత్రాన్ని ఇంటి వద్దే పూర్తి చేసి, సంబంధిత పత్రాలు జతచేసి, కేంద్రాలలో అధికారులకు అందించి, రసీదు పొందాలని ప్రజలకు సూచించారు.