నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ విలేజ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ఇంటిటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.