- శేరిలింగంపల్లి డివిజన్ లోని పలుచోట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ దర్గా, రాజీవ్ గృహకల్ప, గోపినగర్ అంబేద్కర్ భవన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలవేసి నివాళులర్పించారు.
గోపినగర్ దర్గా వద్ద ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గోపినగర్ అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా ప్రజలకు వడ్డించారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన స్ఫూర్తితో ప్రతిఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, ప్రొఫెసర్ పసునూరి రవీందర్, సీనియర్ పాత్రికేయులు వినయ్ గౌడ్, గోపినగర్ దర్గా: ముసలయ్య, హనుమంతు రావు, దస్తగీర్, రామమూర్తి, జగదీష్, సుభాష్ రవి, శంకర్, రజాక్, ఖాజా, రియాజ్, ఇజాజ్, గఫూర్, అబ్దుల్ గని, ఇర్ఫాన్, ఇలియాస్, వెంకటేష్, ఏసు పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్ప: బసవయ్య, జమ్మయ్య, హనుమంతు, గౌతమ్, బాలయ్య రాజు, రాజు, గోరప్ప, షఫీ, ఎల్లప్ప, జయ, కళ్యాణి, కుమారి, శశికళ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
గోపినగర్: కాశిమ్ సర్, కే ఎన్ రాములు ఆనంద్ కుమార్ నరసింహ సత్యనారాయణ దుకారాం రాజేందర్ దేవి ప్రసాద్ సుధాకర్ గోపిదాస్ నరసింహ మనీష్, రవి, శంకర్ బ్యాండ్ రాజు చంద్రకాంత్ కిరణ్ గౌతమ్, భాగ్యలక్ష్మి, జయ, సుధారాణి పాల్గొన్నారు.