- అవార్డు అందజేసిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ
నమస్తే శేరిలింగంపల్లి : బేగంపేటలోని టూరిజం ప్లాజాలో విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధర్యంలో ఉగాది పురస్కార అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హై కోర్ట్ జడ్జి సుధా పెరుగు హాజరయ్యారు. ఇందులో భాగంగా హైదర్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నిశ్చయం గ్రూప్ సీఈఓ విష్ణు ప్రియ ఎచ్యుమెంట్ అవార్డు పొందారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుంచి తమ సంస్థలు ప్రధానంగా నిశ్చయం మ్యాట్రిమోనీ, నిశ్చయం గ్రూప్ సంస్థలు, చాణిక్య డిజిటల్ మార్కెటింగ్, సంస్కృతి ఈవెంట్స్ తాము అందించిన సేవలకు తమ కస్టమర్లు మన్ననలు పొందటం వల్ల ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు ప్రియని విశ్రాంతి ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మదన్ మోహన్ సత్కరించారు.