- మియాపూర్ డివిజన్ లో నివాళులర్పించిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతిని మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, మక్త మహబూబ్ పేట్ విలేజ్, ఎమ్మే నగర్ కాలనీలలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో స్థానిక నాయకులతో కలిసి ఆయన విగ్రహాలకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని, సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదన్నారు.
పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రత్న డాక్టర్ అంబేద్కర్ దేశం కోసం ఎంతో కృషి చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు, మక్తా మహబూబ్ పేట్ విలేజ్ వాసులు, ఎమ్మే నగర్ కాలనీ వాసులు, బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.