- శేరిలింగంపల్లి కార్యాలయంలో మిన్నంటిన సంబురాలు
నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించారని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. మేనిఫెస్టో విడుదల సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బాణసంచాలు కాలుస్తూ సంబురాలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పాటుపడుతూ, అహర్నిశలు కృషిచేస్తూ, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసి మరొకమారు చంద్రశేఖర్ రావు అత్యున్నత భావాలు గల పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పార్టీ ఆఫీస్ ఆవరణలో బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందాల డోలికలలో తేలియాడుతూ, ఉత్సాహభరితంగా బాణాసంచాలు కాలుస్తూ, ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ హ్యాట్రిక్ తధ్యమని తెలంగాణ సాధన ఉద్యమ నాయకుడు అందరి గుండెల్లో నిలిచిన మహానుభావుడని కొనియాడారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కటిక రాంచందర్, వార్డు మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, బస్వరాజ్, నయీమ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్వర్లు, సుభాష్ రాథోడ్, యోగి, శ్రీనివాస్, మహేష్ చారీ, సాయినందన్, సాయి, మహిళా నాయకురాలు లక్ష్మి, సువర్ణ పాల్గొన్నారు.