యువత చూపు బీఆర్ఎస్ వైపు: ప్రభుత్వ విప్ గాంధీ 

  • పార్టీలో చేరిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు
  • సాదరంగా ఆహ్వనించిన ఎమ్మెల్యే

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ , రాజీవ్ గృహ కల్ప (ఆర్ జికే)   కాలనీలకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలో చేరగా.. వారికి ప్రభుత్వ విప్ గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని, యువత ఈ రోజు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.

ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములమవుదామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు ఆనంద్, పాండు, మణికంఠ, సాంబ, అనిల్, లక్ష్మీ, ప్రసన్న, బసమ్మ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, అక్తర్, శశాంక్, సాయి, పవన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here