నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ గ్రామంలో బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక ఘనంగా జరిగింది. ఈ సంబురాలలో కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశంలో పండగలు ఒక ఐక్యమత్యాన్ని నింపుతాయని, ప్రతి ఒక్కరూ జాతి మతం కులం ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణంలో కలిసిపోవడం చూస్తుంటే తెలంగాణ సంస్కృతి చాలా గొప్పదన్న విషయాన్ని గమనించానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వా సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, కాంటెస్టెంట్ కార్పొరేటర్లు కల్పనా, సింధు రెడ్డి, శ్రీధర్ రావు, మనోహర్, రవి గౌడ్, శ్రీశైలం కురుమ, ఆకుల లక్ష్మణ్, వీరు యాదవ్, దేవేందర్, పవన్, జగన్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ సలీం, రవి ముదిరాజ్, అశోక్ నాయి, నవీన్, పాల్గొన్నారు.