నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా సౌందర్య రాజన్ ని నియమితులయ్యారు. ఈ సందర్బంగా సౌందర్య రాజన్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్, రాష్ట్ర ఇంచార్జ్ దివేది, రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు కప్పెర దుర్గేష్, సామ్యూల్ ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు.