సామాజిక సేవతోనే నిజమైన సంతృప్తి

  • సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్
  • అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ సేవలందిస్తాం : ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్
  • 2వ రోజు కొనసాగిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: గంగారం విలేజ్ బస్తీ దవాఖాన వద్ద సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని భిక్షపతి యాదవ్ ప్రారంభించారు. అనంతరం ట్రస్టు కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులు ఉంటారు కానీ పేదవారికి సహాయం చేసే గొప్ప గుణం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారని, మనం పుట్టిన గడ్డకు ఎంతో కొంత ఉపకారం చెయ్యాలనే దృఢ సంకల్పంతో విద్య -వైద్యం పై దృష్టి సాధించి పేదవారు నివసిస్తున్న కాలనీలలో కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం, నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వడం నిజమైన సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాల్ యాదవ్, అనంతరెడ్డి, రాజేష్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, బాలరాజ్, రమణయ్య, రాజు యాదవ్, శేఖర్, డి. రాజేష్, శ్రీనివాస్ యాదవ్ , కౌశిక్, నందు, పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో కొంతమంది గ్రామస్తులు బిక్షపతి యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారిలో మల్లేష్ యాదవ్, గోపాల్ గౌడ్, కృష్ణమూర్తి వీరందరి, అశోక్, సత్తయ్య లక్ష్మి ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here