నమస్తే శేరిలింగంపల్లి : అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు శిరీష సత్తుర్ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులు శిరీష సత్తుర్ ను శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, కాశినాథ్ యాదవ్, వెంకట్ నాయక్, షౌకత్ అలీ మున్నా, రాములుగౌడ్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, పద్మయ్య, రాజ్యలక్ష్మి, స్వరూపా, కుమారి, ఎ. స్వరూపా, సునీత పాల్గొన్నారు.