ఆదరణ.. ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం

  • బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున్న చేరికలు
  • సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు సాయి కుమార్  ఆధ్వర్యంలో  వివేకానందనగర్ లోని ఎమ్మెల్యే  కార్యాలయానికి వెళ్లగా..  వారికి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ  యువత  అంతా బీఆర్ఎస్ వైపే ఉందని, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.  అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,   బీఆర్ఎస్ పార్టీ  నాయకులు నాయి నేని చంద్రకాంత్, ప్రసాద్  పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులలో రాజు, గురువయ్య, నగేష్, శ్రీనివాస్, వేణు ఆర్. శ్రీనివాస్, గురు, కార్తిక్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here