నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక 124 డివిజన్ తులసి వనం అపార్ట్మెంట్స్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచి వేడుకలు నిర్వహించారు.


సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మేలే జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.