నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, నాయకులు కార్యకర్తలు ఆయన నివాసానికి వెళ్లి పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ నిలయానికి వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయి అన్, నర్సింగరావు, జి సంగారెడ్డి, తెప్ప బాలరాజు ముదిరాజ్, శేఖర్ గౌడ్, అంజద్ అమ్ము, సత్య రెడ్డి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.