అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
  • 61వ రోజుకు చేరుకున్న గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర
  • మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా కరపత్రాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బీజేపీ, ప్రజల గోస – రవన్న భరోసా ప్రజాయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్, ఖానమేట్ లలో చేపట్టిన మాహా సంపర్క్ అభియాన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ, బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఖానామేట్, ఇజ్జత్ నగర్ కాలనీ వాసులు, స్థానిక నాయకులు, మాదాపూర్ డివిజన్ నాయకులు , నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే, నాయకులు ఈ ప్రాంతానికి చేయకపోగా , సుందరీకరణ పేరుతో మొండి కుంట చెరువు కబ్జా చేస్తున్నారని , ఇప్పటికీ మంజీరా వాటర్ సమస్య అలాగే ఉందన్నారు. ఇనాగరేషన్ అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు రోడ్లు పూర్తి కాలేదని, 9 ఏళ్లలో పెన్షన్లు ,రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.

తాము గెలిచిన తదనంతరం పాదయాత్రలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, మల్లేష్ , కృష్ణ , గోపాల్ గౌడ్, మదనా చారి, మధు యాదవ్ , గోవర్ధన్ రెడ్డి, యాదయ్య, బాలు నాయక్, విష్ణు, నరేష్ , రవి, కుర్మయ్య, శ్రీనివాస రెడ్డి, శివ యాదవ్, పద్మ,భారతి, స్వప్న, చంద్రకళ, నాగులు, రవి ముదిరాజ్, బాబు, గణేష్, రాము, శివరాజ్, వెంకటేష్, వంశీ , పవన్, సూర్య, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here