- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో ప్రతిఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ లో బస్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ విద్యార్థులతో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో బస్తి నాయకులతో కలిసి పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని తెలంగాణకు మనం ప్రతిన బూనాలన్నారు. విద్యార్థులు వారి వారి ఇంట్లో మొక్కను నాటాలని వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
వన మహోత్సవంలో అందరిని భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, సుభాష్ చంద్ర బోస్ నగర్ డెవలఫ్ మెంట్ కమిటీ సభ్యులు, నాయకులు శివ, మునఫ్ ఖాన్, ఇస్మాయిల్, ముక్తర్, వెంకటేష్, సత్యనారాయణ యాదవ్, బుజంగం, రాములు యాదవ్, ఖాజా, అష్రాఫ్, మహిళలు శశిరేఖ, లక్ష్మీ, పార్వతి పాల్గొన్నారు.