నమస్తే శేరిలింగంపల్లి: పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమ స్వరార్చన కార్యక్రమం “శ్రీ వాగ్దేవి నాట్యస్థల్” వారి నృత్యార్చన తో ప్రారంభమైంది. గురువు ” శైలజ వడ్డానం” వారి శిష్యులు “చైత్ర, జస్విత, కాత్యాయని, కనిష్క, లిఖిత, భాను, ఐన, నిర్వి, నిశ్చిత, ప్రణిత, ప్రేరణ, రేవతి, సమృద్ధి, శైవి, శృతి, స్నిగ్ద, శ్రీనిధి, శ్రియ, బాలా, లాస్య” సంయుక్తంగా “దేవేంద్ర మౌళి శ్లోకం, తాండవ నృత్యకరి, భావములోన బాహ్యము నందున, వినరో భాగ్యము, అదివో అల్లదిహో, నారాయణతే నమో, దశావతార శబ్దం, ముద్దుగారే యశోద, అలరులు కురియగా, కొండలలో నెలకొన్న కోనేటి, జగడపు చనవుల జాజర” అనే సంకీర్తనలకు తమ అద్భుతమైన నృత్య సేవను అందించారు.
తదుపరి కుమారి. సాయి ఆశ్రయ సిరువోలె, “మరుగేలరా ఓ రాఘవా”, “సీతమ్మ మాయమ్మ”, “చూతమురారే” త్యాగరాజ కీర్తనతో స్వరార్చన చేశారు వీరికి వయోలిన్ – విష్ణు, మృదంగం – దూసి తారకరామ్ వాయిద్య సహకారం అందించారు. తదనంతరం, శోభారాజు అన్నమయ్య కీర్తనకు విశ్లేషణ అందించారు. తదుపరి, శోభారాజుచే కళాకారులందరికి సంస్థ జ్ఞాపికను బహుకరించారు. చివరిగా స్వామి వారికి హారతి, ప్రసాద వితరణతో స్వరార్చన ముగిసింది.