- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప లే అవుట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, మౌళిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో బస్తీలో ఉన్న సమస్యలను స్థానికులు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఆయా కాలనీలలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.