- ఫ్రెండ్స్ షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఫ్రెండ్స్ షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు దుప్పెల్లి వెంకటేశం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కాలనీవాసులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటి ఫ్రెండ్స్ షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఫ్రెండ్స్ షిప్ డే గుర్తుగా ఫ్రెండ్స్ కాలనీ లో మొక్కలు నాటడం చాలా గొప్ప విషయం అని , అన్ని బంధాల కన్నా స్నేహం బంధం చాలా గొప్పదని, స్నేహితుల రోజు గుర్తుగా మొక్కలు నాటడం చాలా అభినదించదగ్గ విషయమన్నారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఫ్రెండ్స్ కాలనీ లాగా ప్రతి కాలనీలో వనమహోత్సవం హరిత వైభవోత్సవంగా విరాజిల్లునని, కాలనీలు పచ్చని మణిహారంగా మారునుందని, కాలనీలో ప్రధాన రహదారికిరువైపులా, అంతర్గత రోడ్లలో మొక్కలు నాటడం జరిగినదని, కాలనీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రసాద్, వెంకటేష్, అక్బర్ ఖాన్, గుడ్ల ధనలక్ష్మి, నరేందర్ బల్లా, వరలక్ష్మి, భవాని, మాధవి ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ పట్నాయక్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్, కాలనీ పెద్దలు కృష్ణానాయక్, సి న్ నాథ్, ప్రకాష్ రెడ్డి, ఉపేందర్ దీప్, రమేష్ బాబు, వేణుగోపాల్, ఫసిహుద్దీన్, రవీంద్రనాథ్, డాక్టర్ గోవర్ధన్, గోవర్ధన్ రెడ్డి, వెంకటస్వామి, రవీంద్ర, రమేష్, పార్ధసారధి రెడ్డి, ప్రకాష్ , శ్రీనివాస్, కిరణ్, చౌదరి, వేణుగోపాల్, రఘునాథ్ రెడ్డి రవీందర్ రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు.