అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యం

 

  • అభివృద్ధిలో మాకు ఎవరూ సాటిరారు
  • అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, గోపనపల్లి తాండ కు చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం జనార్ధన్, గడ్డం ఆనంద్, పలపు చంద్రమౌళి, బాగారి రామకృష్ణ, గడ్డం బాలరాజు, గడ్డం స్వామి, గడ్డం ప్రభు, గడ్డం శ్రీను, గడ్డం నరేష్, రాజేష్, రామకృష్ణ గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో కార్పొరేటర్ కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరారు.

పార్టీ లో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

వారికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చూపించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదని అన్నారు.

బీజేపీ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, ములగిరి శ్రీనివాస్, శేఖర్, ప్రకాశ్ , మహేష్, శేఖర్, రాజు, సురేష్, రంగస్వామీ, శ్రీశైలం, రాజు, మధు, నగేష్ క్రాంతి, వెంకటేష్, శివ, రంగస్వామి, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here