- రెండవ రోజు కొనసాగిన గడపగడపకు జైపాలన్న కార్యక్రమం
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీ పతనాన్ని ఎవరు ఆపలేరని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ గౌషా కేఫ్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 6 గ్యారంటీ పథకాల గురించి గడపగడపకు తిరిగి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని, పార్టీకి అనేక సంస్థలు సర్వే ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని దాదాపు ఇప్పటికే మెజార్టీ శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, హస్తం హావ కొనసాగిపోతుందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కొంతమంది కల్లబొల్లి హామీలు ఇవ్వడానికి వస్తున్నారని వాళ్లతో జాగ్రత్త ఉండాలని అన్నారు. ఇందిరమ్మ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే గ్రామాల్లో కనిపిస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అనేక విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి జెరిపెటి జైపాల్ తో పాటు మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.