నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో మన ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేకున్నప్పటికీ మన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందొ సులువుగా తెలుసుకోవచ్చు. క్రింది లింకు ఓపెన్ చేసి అందులో మీరు ఏ వార్డుకు చెందిన వారో ఆ వార్డ్ సంఖ్యను సెలెక్ట్ చేయాలి. అనంతరం మీ పూర్తి పేరుతో గానీ, ఇంటి పేరుతో గానీ, పేరులోని కొంత భాగాన్ని గానీ ENTER YOUR NAME IN ENGLISH పక్కన గడి లో రాసి సెర్చ్ చేయండి. మీ పేరుతో ఉన్న ఓటర్ల జాబితా మీకు కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలతో సరిపోలిన మీ ఓటును సులువుగా వెతికి పట్టుకోవచ్చు. ఈ వెబ్ సైట్ నుండి పోలింగ్ స్లిప్ సైతం డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా మీ యొక్క గుర్తింపు కార్డు సహాయంతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పేరును వెతికేందుకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి. searchvoterslipulb.tsec.gov.in/downloadvoterslipulb.do