ఎన్నికల పండగకు సర్వం సిద్ధం…జంట సర్కిళ్లలో 615 పోలింగ్ కేంద్రాలు

డిఆర్ సి కేంద్రాల వద్ద పోలింగ్ సామగ్రి పంపిణీ లో నిమగ్నమైన ఎన్నికల అధికారులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో జిహెచ్ఎంసి ఎన్నికల పండగకు సర్వం సిద్ధమైంది. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలో గల ఏడు డివిజన్లలో కలిపి 615 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొండాపూర్ డివిజన్ లో 99 గచ్చిబౌలిలో 73 శేరిలింగంపల్లిలో 93 మాదాపూర్ లో 83 మియాపూర్ లో 87 హఫీజ్ పెట్ లో 97 చందానగర్ లో 83 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరొ ఇద్దరు ఎన్నికల అధికారులు ఎన్నికల విధుల్లో అందుబాటులో ఉండనున్నారు. వీరిని సమన్వయం చేస్తూ కొన్ని పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక రూట్ అధికారి ఎప్పటికప్పుడు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.

 

ఎన్నికల పనులను పర్యవేక్షిస్తున్న చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ సుధాంశు నందగిరి

 రూట్ ఆఫీసర్లను కో ఆర్డినేట్ చేసేందుకు గానూ జోనల్ ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. కాగా సోమవారం ఎన్నికల అధికారులు మియాపూర్ లోని సెంటియా ది గ్లోబల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన డిఆర్ సి కేంద్రంలో సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్ల ప్రిసైడింగ్ అధికారులకు, గచ్చిబౌలి లో ఏర్పాటు చేసిన డిఆర్ సి కేంద్రంలో సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల ప్రిసైడింగ్ అధికారులకు బ్యాలట్ బాక్స్ లు, బ్యాలట్ పత్రాలతో పాటు, మాస్క్ లు, శానిటైజర్ తదితర వస్తువులతో కూడిన కరోనా కిట్లను పంపిణీ చేశారు. ఎన్నికల అనంతరం పోలింగ్ సామాగ్రిని తిరిగి అధికారులు డిఆర్ సి కేంద్రాల్లో స్వాధీనం చేసుకోనున్నారు.

పోలింగ్ సిబ్బందికి అందజేసిన కరోనా కిట్లు, పోలింగ్ సామాగ్రి
డిఆర్ సి కేంద్రాల్లో పంపిణీ కి సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్స్ లు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here