నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసిన విషయం విధితమే. అంతేకాక ఈ నెల మూడో తేదీ నుంచి 10 వరకు నామినేషన్లకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించగా… శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. మూడో తేదీన ఒకటి, నాలుగవ తేదీన 2, 6వ తేదీన 5, ఏడవ తేదీన 3, 8వ తేదీన 7, 9వ తేదీన ఏడు, 10వ తేదీన 16 చొప్పున మొత్తం 41 మంది నామినేషన్ వేశారు. దాఖలు అయిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియను నేడు (సోమవారం) నిర్వహించారు. ప్రక్రియలో 41 అభ్యర్థుల నుంచి 61 సెట్లు దాఖలు కాగా.. 55 సెట్లు స్వీకరించబడ్డాయి. ఐదు మంది అభ్యర్థులు వేసిన ఆరు సెట్లు తిరస్కరణకు గురయ్యాయి. 36 మంది నామినేషన్లు ఆమోదించబడ్డాయి. నవంబర్ 15వ తేదీన నామినేషన్ల సంహరణ తర్వాత అసలు ఎంతమంది బరిలో ఉంటారనేది తెలియనుంది
- తిరస్కరణకు గురైన అభ్యర్థుల సెట్లు
1. షేక్ సైఫ్, రాష్ట్రీయ జన మోర్చా పార్టీ.
2. పి మాధవి లత, స్వతంత్ర అభ్యర్థి
3. ఆకుల చంద్రశేఖర్ యాదవ్, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ
4. ఎం సామ్యూల్, బహుజన రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ
5. దొడ్డ విజయకుమార్, స్వతంత్ర అభ్యర్థి
- స్వీకరించబడిన అభ్యర్థుల సెట్లు
1. ఆరెకపూడి గాంధీ, భారత రాష్ట్ర సమితి
2. జగదీశ్వర్ గౌడ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3. ఎం. రవి కుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ
4. ఓ. శ్రీనివాస్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ
5. అనిల్ కుమార్ తుడుం, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్)
6. కొండపల్లి రాములు, బహుజన్ ముక్తి పార్టీ
7. మహమ్మద్ గౌస్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
8. దుర్గాప్రసాద్ సలాడి, ఇండియా ప్రజాబంద్ పార్టీ
9. దూదేకుల ఇమామ్ హుస్సేన్, ఆల్ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ
10. నక్క ప్రభాకర్, ప్రజా వెలుగు పార్టీ
11. నెమ్మడి శ్రవణ్ కుమార్, ధర్మ సమాజ్ పార్టీ
12. వి. ప్రసాద్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా
13. ఏ రాజు, దళిత బహుజన పార్టీ
14. సాయికుమార్ నర్ర, యుగ తులసి పార్టీ
15. ఆరెకపూడి శ్యామల దేవి, స్వతంత్ర అభ్యర్థి
16. ఆకర్ష్ శ్రీరామోజు, స్వతంత్ర అభ్యర్థి
17. కార్తీక్ గుండ్ల, స్వతంత్ర అభ్యర్థి
18. కొక్కొండ పృథ్వి పతి రావు, స్వతంత్ర అభ్యర్థి
19. గుంజి వాసు, స్వతంత్ర అభ్యర్థి
20. జనపాల దుర్గాప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి
21. జువ్వ ఫణి కుమార్, స్వతంత్ర అభ్యర్థి
22. పర్నంది రాములు, స్వతంత్ర అభ్యర్థి
23. ఎం. ప్రభు, స్వతంత్ర అభ్యర్థి
24. బీర శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి
25. మహమ్మద్ పాషా, స్వతంత్ర అభ్యర్థి
26. ఎం. జ్ఞానరాజు, స్వతంత్ర అభ్యర్థి
27. మేకల వెంకటసుబ్బమ్మ, స్వతంత్ర అభ్యర్థి
28. రవితేజ శ్రీరుముల, స్వతంత్ర అభ్యర్థి
29. రవీందర్ ఉప్పుల, స్వతంత్ర అభ్యర్థి
30. రాజమహేంద్ర కటారి, స్వతంత్ర అభ్యర్థి
31. నేను నంది మండలం, స్వతంత్ర అభ్యర్థి
32. శ్రీనివాసరావు జాదవ్, స్వతంత్ర అభ్యర్థి
33. షేక్ ఫరూక్, స్వతంత్ర అభ్యర్థి
34. సయ్యద్ సబేర్, స్వతంత్ర అభ్యర్థి
35. ఎం. సాంబశివ ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి
36. ఎం. హరిణి స్వతంత్ర అభ్యర్థి