- ఏకగ్రీవ తీర్మాన పత్రం అందజేసిన వెంకటేశ్వర నగర్ మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏకగ్రీవ తీర్మాన పత్రంను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి మున్నూరు కాపు సంఘం సభ్యులు వివేకానంద నగర్ లోని గాంధీ నివాసానికి వెళ్లి ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ విప్ గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, నాయినేని చంద్రకాంత్ రావు ,చంద్రారెడ్డి, కార్తిక్ రావు మరియు మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు