మీ బిడ్డగా మీకు సేవకుడిగా పని చేస్తా.. ఆశీర్వదించండి

నమస్తే శేరిలింగంపల్లి: మీ ఇంటి బిడ్డగా మీ సేవకుడిగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని, మీ అమూల్యమైన ఓటు తమకు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మాతృశ్రీ నగర్ కాలనీవాసులని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ, నెహ్రూ గాంధీ, సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పై నమ్మకంతో మాతృ శ్రీ నగర్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసి తనను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

పూల బొకే అందించి జగదీశ్వర్ గౌడ్ కి సన్మానం

కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రతి ఒకటి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వచ్చి కుల మత అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు స్నేహభావంతో కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటారని, తమ ఇంటి కుటుంబ సభ్యుడిగా తనను ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం, అందరితో కలవడం సంతోషంగా ఉందని జగదీశ్వర్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

మాతృశ్రీ నగర్ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనలో పాల్గొన్న కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ,కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here