- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఏఐఎఫ్ డీఎస్
- తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి
- ఏడాది గడుస్తున్నా పూర్తిగాని నిర్మాణం
- తరగతి గదులు సరిపోక షిఫ్టుల వారీగా విద్యాబోధన
- ఇబ్బందుల్లో విద్యార్థులు
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 950 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో తరగతి సరిపోకపోవడంతో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు… మధ్యాహ్నం 11 నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
బొల్లారం బాచుపల్లి ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం బస్సు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలంలో మీసేవ ఉండడంతో స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని, పాఠశాల ప్రిన్సిపల్ చె ప్పారని తెలిపారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని, వెంటనే ప్రారంభించిన భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో AIFDS మాజీ నాయకుడు దశరథ్ నాయక్ పాల్గొన్నారు.