నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఔటరు రింగు రోడ్డు పై చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ప్రారంభించి మాట్లాడారు.
సత్యసాయి సేవా సంస్థలు మానవసేవే మాధవసేవ – మాధవసేవే మానవసేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఆ సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.సి రామన్న, పి. రామారావు, దయాసాగర్, బి. లక్ష్మినారాయణ, ఎ. కనుంగో, టి. రాహుల్ సాగర్, కె. దీప్తి, టి. ఉషారాణి, బి. అరుణ, రాంమోహన్ రావు పాల్గొన్నారు.