నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. గణపతి శర్మ బ్రహ్మాత్వంలో ఆలయ అర్చకుల సహకారంతో కన్నల పండువగా జరిగిన ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాని తిలకించారు. అయితే ఈ సారి కూడా అక్బర్ షరీఫ్ మియా ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. వారిని ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు.
అనంతరంలక్ష్మీ ప్రభ స్వామివారి కళ్యాణా కార్యక్రమానికి తగ్గట్టుగా సందర్భోచితముగా అద్భుతంగా గానం చేశారు.
కళ్యాణ మహోత్సవంలో భాగంగా భాస్కర డాన్స్ అకాడమీ నుండి నృత్య ప్రదర్శనలు అలరించాయి. శ్రీదేవి చైతన్య లహరి డాన్స్ అకాడమీ నుండి పద్మజ శిష్య బృందంచే కూచిపూడి నృత్యం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.