నేడు యంసిపిఐ(యు) అభ్యర్ధి కామ్రేడ్ వనం సుధాకర్ నామినేషన్

  • ఎం.ఏ.నగర్ నిర్వహించిన సమావేశంలో యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : బీఎల్ఎఫ్ బలపర్చిన యంసిపిఐ(యు) అభ్యర్ధి కామ్రేడ్ వనం సుధాకర్ నామినేషన్ నేడు చేవెళ్ల పార్లమెంట్ ఆర్.ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ అన్నారు. ఎం.ఏ.నగర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగ ఉల్లంఘన జరిగే ప్రమాదం ఉందన్నారు. దేశ ఆర్థిక ప్రజా జీవన ఇచ్చిందాన్ని చేసే పెట్టుబడిదారి ఆర్థిక విధానాన్ని అవలంబించిన కాంగ్రెస్ పాలన కూడా ఈ దేశానికి ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుత భారత దేశ ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థను సరైన సక్రమ మార్గంలో నడిపించాలంటే నూటికి 93 శాతంగా ఉన్న బహుజనలు చట్టసభలకు వెళ్లాలని, దోపిడీ వివక్ష లేని భారత సమాజాన్ని నిర్మాణం చేయాలని, దేశంలో సమానత్వ సాధన కోసం హక్కుల పరిరక్షణ కోసం కుల మతా నిర్మూలనకు బలమైన ఉద్యమాల నిర్మించడానికి వామపక్షాల ఐక్యత జరగాలని కాంక్షించే వామపక్ష సామాజిక స్వామికి ప్రజాతంత్ర శక్తులు దేశ పార్లమెంట్లో అధికారంలో ఉండాలని, అప్పుడే భారత వ్యవస్థ సుస్థిరంగా ఉంటుందన్నారు.

ఇందులో భాగంగా మూడు స్థానాలలో ఎంసిపిఐ(యు) పోటీ చేస్తుందని మిగతా స్థానాల్లో మతోన్మాద బిజెపి, పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి ముడిబడి ఉన్న కాంగ్రెస్లను వ్యతిరేకిస్తూ వామపక్ష సామాజిక అభ్యర్థులకు ఎంసిపిఐ(యు) మద్దతు తెలుపుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యత నిర్వహిస్తున్న కామ్రేడ్ వనం సుధాకర్ ని నామినేషన్ దాఖలు చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎంసిపిఐ(యు( పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె మురళి, తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్, మియాపూర్ డివిజన్ నాయకులు గూడ లావణ్య, లలిత, పార్వతమ్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here