- శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి
నమస్తే శేరిలింగంపల్లి: గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతిని పురస్కరించుకోని శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
మియాపూర్ ఆల్విన్ కాలనీ పాపన్న చౌరస్తాలోని సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహానికి శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. మూడున్నర శతాబ్దాల క్రితమే సబ్బండ వర్గాలను ఏకంచేసిన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. గోల్కొండ కోటను జయించిన చరితార్ధుడికి తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని, ట్యాంక్ బండ్ పై ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
తద్వారా భావితరాలకు సర్దార్ సర్వాయి పాపన్న ఔన్నత్యాన్ని వివరించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం స్టీరింగ్, మెయిన్, యూత్ కమిటి సభ్యులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.