నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షలుగా బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి ఆయనను నియమించగా… శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నియామక పత్రం అందించారు.
అంతకుముందు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నీ విజయభాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి, టిపిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డిసీసీ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ లకు, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.