- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
- ఏడు డివిజన్లకు నూతన కమిటీల నియామకం
- నియామక పత్రాలు అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, పనిచేయాలని, ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 డివిజన్లకు (శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, హాఫీజ్ పెట్, మాదాపూర్, మియాపూర్, చందానగర్) నూతన కమిటీ ఏర్పాటయ్యాయి. నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కమిటీలు నియామకం కాగా.. డివిజన్ అధ్యక్షుల సమక్షంతో పాటు దాదాపు ప్రతి డివిజన్ నుంచి 50 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించి నూతన కమిటీల సభ్యులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని, అందరికీ గుర్తింపు ఉంటుందని, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తెలిపారు.
మండల కమిటీ తోపాటు అనుబంధాల సంఘాల కమిటీల నియామకం చేపట్టి త్వరలో డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకుపోతామని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోర్దినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్, మాజీ కౌన్సిలర్ నర్సింగ్ రావు, నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, డివిజన్ అధ్యక్షులు మహిపల్ యాదవ్, జహంగీర్, అలీ, సురేష్ నాయక్, భారత్ గౌడ్, రేణుక, మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జామీర్, ఇలియస్, వీరేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, తిరుపతి, దినేష్, రవీందర్ రెడ్డి, కాంటెస్టడ్ కార్పొరేటర్ నగేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, సోషల్ మీడియా కోర్దినేటర్ శ్రీహరి గౌడ్, మహిళల కమిటీ అధ్యక్షులు ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, సారా ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు పాల్గొన్నారు.