వేడుకగా బతుకమ్మ చీరెల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ శేరిలింగంపల్లి, మియాపూర్ డివిజన్లలో వేడుకగా కొనసాగింది. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పాల్గొని ఆయా డివిజన్ల ఆడబిడ్డకు బతుకమ్మ సారె పంపిణీ చేశారు.

  • శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో..

శేరిలింగంపల్లి డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రాధమిక పాఠశాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆడపడుచులకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని, దీనిని ఆడబిడ్డలందరూ ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరలను బహుమతిగా అందజేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చేనేత చీరల పంపిణీ కార్యక్రమం నగర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నదని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ బస్వారాజ్ లింగయ్యత్, వార్డ్ మెంబెర్ శ్రీకళ, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, సాయి, వెంకటేశ్వర్లు, హరి మహిళా కార్యకర్తలు సౌజన్య, కుమారి, కళ్యాణి, రోజా, లక్ష్మి పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రాధమిక పాఠశాలలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
  • మియాపూర్ డివిజన్ పరిధిలో..

మియాపూర్ డివిజన్ పరిధిలోని JP నగర్ కాలనీ, మియాపూర్ విలేజ్ లో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మియాపూర్ డివిజన్ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మియాపూర్ డివిజన్ లో  పేద మహిళలకు ఉచితంగా సారె అందించడం చాలా ఆనందం గా ఉందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి  చూపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పవరపు గంగాధర్ రావు, చంద్రిక ప్రసాద్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా, సుప్రజా, ఉమ, కల్పన, లత పాల్గొన్నారు.

స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here