సకాలంలో స్పందిస్తే గుండె పదిలం

  • డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించిన వైద్య నిపుణులు

నమస్తే శేరిలింగంపల్లి: వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ఫైర్ సేఫ్టీ అధికారి మోహనరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ అధికారి మోహనరావు, చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ , కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్, న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ హాజరయ్యారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ సకాలంలో చర్యలు తీసుకోకపోవడంవల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారని, క్లిష్టసమయాల్లో ప్రతి నిమిషం ముఖ్యమైనదని, ప్రాణ రక్షణకు ఇలాంటి అత్యాధునిక సదుపాయాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ నాణ్యమైన, అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం గల మెడికవర్ హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణంగా మానవ జీవితం ఒత్తిడితో కూడుకున్నదని, తగినంతగా నిద్ర లేకపోవడం, అనారోగ్య కారణాల వల్ల ఒత్తిడి అధికమవుతుందని,సాధ్యమైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచితే గుండె ప్రశాంతగా ఉంటదని పేర్కొన్నారు. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుంటే గుండెజబ్బుల బారినపడకుండా ఉండొచ్చని అన్నారు. గుండెపోటు రావడానికి గల సాధారణ కారణాలను ( ఒళ్లు నొప్పులు, నీరసం ఆవరించడం, నిద్ర లేమి, ఆందోళన, కోపం, డిప్రెషన్‌ కలగడం, అసహనం, మతిమరుపు) ను ముందే గుర్తించి సరైన సమయంలో హాస్పిటల్ కి వెళితే స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభిస్తున్న ఫైర్ సేఫ్టీ అధికారి మోహనరావు

గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలని, దీనివల్ల ఒత్తిడి & డిప్రెషన్‌ తగ్గుతుందని సూచించారు.
అనంతరం జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బేగంపేటలో ఈ విభాగాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉన్నదన్నారు.
అనంతరం “Rs.499/- Heart Screening Package” విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మేఘ, బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ రుషికేశ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here