నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ అధ్యక్షులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణకు డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసిఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అప్ప జంక్షన్ వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీగా జన సమీకరణ తో తరలి వెళ్లి సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ కార్యక్రమానికి తరలివెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగారావు, మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, రాజు నాయక్, సమ్మారెడ్డి, కృష్ణ గౌడ్, BSN కిరణ్ యాదవ్, లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు వాలా హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, అనిల్ రెడ్డి, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, పోతుల రాజేందర్, సత్యనారాయణ, చంద్రిక ప్రసాద్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ గోపారాజు, జనార్దన్, అశోక్,కాజా, యాదయ్య గౌడ్, బసవయ్య పాల్గొన్నారు.